నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్పెరెన్స్(JKNC) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతికి సానుభూతి వ్యక్తం చేశారు. ఒక దేశ అధినేతను హత్య చేయడానికి ఎవరికీ ఎలాంటి హక్కు లేదని, మోడీ ప్రభుత్వం ఈ తరహా సంఘటనలను ఖండించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కష్టకాలంలో తాము ఇరాన్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని తెలిపారు.
నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొత్తం వారికి అండగా ఉంటామన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనితోపాటు అనేక మంది కీలక నేతలు మరణించారు. అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.తాజాగా ఖమేనీ మృతికి అసెంబ్లీ సమావేశాల్లో సదురు పార్టీ ఎమ్మెల్యేలు సానుభూతి తెలిపారు.




