Friday, September 5, 2025
E-PAPER
spot_img
HomeNewsలంబాడిలపై అసత్య ప్రచారం చేస్తున్నా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి

లంబాడిలపై అసత్య ప్రచారం చేస్తున్నా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి

- Advertisement -



లంబాడి గిరిజన సంఘాల ఐక్యవేదిక
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగర బంజారా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. ఈ ఏడాది జులై 24న వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.

ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా..? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బిఆర్ఎస్, బీజేపీల వైఖరి కూడా ఎటువైపో..? సమాధానం చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయక్, నరేష్ నాయక్ , భూక్య జగన్ లాల్, రెడ్డి నాయక్, శర్మన్ నాయక్, రవిలాల్, బిక్కు నాయక్, బిల్లు నాయక్, రాజు నాయక్, గోపి నాయక్, తిరుపతి నాయక్, దేశి నాయక్, ప్రభు నాయక్, ప్రకాష్ నాయక్, హనుమంతు నాయక్, గోపి నాయక్, భూపతి నాయక్, సంతోష్ నాయక్, లాకావత్ తిరుపతి నాయక్, గుగులోత్ తిరుపతి నాయక్, కేపతి నాయక్, రాజు నాయక్, బిక్కు నాయక్, బీలో నాయక్, అజ్మేరా తిరుపతి నాయక్, దేవిలాల్ లింగం నాయక్, రాజు నాయక్, మోతిలాల్ నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad