- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి తండ్రి కేసీఆర్‌ను పరామర్శించారు. అంనతరం వైద్యులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే నిన్న రాత్రే వైద్యులు కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఈ సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని పేర్కొన్నారు.
- Advertisement -