No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంమే 31న ఆ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

మే 31న ఆ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మే 31 సాయంత్రం గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్‌లో మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌నున్నారు. పరిపాలనా కారణాల రీత్యా మే 29న జరగాల్సిన డ్రిల్స్ 31కి వాయిదా పడింది. ఇటీవల కాలంలో సరిహద్దు అవతల నుంచి భారీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి నెల ఇటువంటి విన్యాసాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. విన్యాసాల సమయంలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని… అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ముందు ఢిల్లీ, హైద‌రాబాద్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి రేపు మాక్ డ్రిల్ నిర్వ‌హించాల‌ని కేంద్రం ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad