Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయందేశ స‌రిహ‌ద్ద రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్స్ వాయిదా..!

దేశ స‌రిహ‌ద్ద రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్స్ వాయిదా..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ సరిహద్దు రాష్ట్రాలైన‌ గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యాణా, జమ్ము కశ్మీర్‌లో నేడు జ‌ర‌గాల్సిన మాక్‌ డ్రిల్స్‌ డ్రిల్స్‌ వాయిదా పడ్డాయి. ఆపరేషన్‌ షీల్డ్‌ పేరుతో నిర్వహించాల్సిన ఈ మాక్‌ డ్రిల్స్‌ను కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యాణా ప్రభుత్వం వెల్లడించింది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్‌ డ్రిల్స్‌ వాయిదా వేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఇక జూన్‌ 3న మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నట్లు పంజాబ్‌ వెల్లడించింది.ఏప్రీల్ 22న పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -