హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుచిత్ర వద్ద ఉన్న వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ వాణిజ్య సముదాయం అపరిశుభ్రంగా ఉన్నది. ఇందులో ఉన్న దాదాపు ఏడు షట్టర్స్ నిరుపయోగంగా ఉన్నవి. పై అంతస్తులో ఉన్న మీసేవ, ఆధార్ కేంద్రాల్లో ఈ సముదాయ ఆవరణ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. పైకి వెళ్లే మార్గాన మెట్లకు రేయిలింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన చిన్న పిల్లలు, గర్భిణులు, వయోధికులు మెట్లు ఎక్కడానికి ప్రయాసపడాల్సి వస్తున్నది పై అంతస్తుకు వెళ్లడానికి ఉన్న మెట్ల మార్గంలో ఆనుకుని ఉన్న మూతపడిన షట్టర్ నిండా చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతున్నది. ఈమెట్ల మార్గంలోని గోడలపై పాన్ ఉమ్మిన మరకలు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల క్రిమికీటకాలు ముసిరి అంటువ్యాధులు వ్యాపించుటకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. పైగా కేంద్రాలు నడస్తున అంతస్తులో టైల్స్ ఉడిపోయి ఉన్నవి. పైభాగంలో సీలింగ్ కూడా కుప్పకూలేలా బిచ్చలు లేస్తున్నవి. మొత్తంగా చూస్తే అపరిశుభ్ర వాతావరణంలో ఆధార్, మీసేవలు నడుస్తున్నవి. కరెంటు, కంప్యూటర్ కేబుళ్లు ఎక్కడికక్కడే వేలాడటం వల్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకునే అవకాశం ఉన్నది. .దేశ పౌరుల ముఖ్యమైన గుర్తింపు ఆధార్.ఈ కేంద్రాలే ఈ విధంగా ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది. సంబంధిత అధికారులు వెంటనే ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేయాలి. అధునాతన సాంకేతికతో వసతులతో తీర్చిదిద్ది దరఖాస్తు, లబ్దిదారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్నికల్పించాలి.
– డి.రాంచందర్ రావు, 9849592958
‘మీసేవ’లను ఆధునీకరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES