నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ 11పాలనలో యువతను మోసం చేశారని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగంపై కేంద్రాన్ని పలుమార్లు ప్రశ్నించిన సమాధానం లేదని మండిపడ్డారు. తన 65ఏండ్ల రాజకీయ జీవితంలో మోడీ లాంటి పీఎంను తాను ఎప్పుడు చూడలేదని ఎద్దేవా చేశారు. ఏదీ అడిగిన స్పందించికుండా ప్రధాని మోడీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఉగ్యోగాల పేరుతో యువతను, మాటలతో పేద ప్రజలను, మద్దతు ధర పేరుతో రైతులను మోసగించారని ఆయన ధ్వపజమోత్తారు.ప్రజల అభిష్టం మేరకే కర్నాటకలో మరోసారి కులగణన చేపడుతున్నామని, కొన్ని వర్గాలు స్థానం చలనం కోరుంటున్నాయని ఆయన ఢిల్లీ మీడియా సమావేశంలో స్ఫష్టం చేశారు.
మోడీ 11ఏండ్ల పాలనలో యువతను మోసం చేశారు: ఖర్గే
- Advertisement -
- Advertisement -



