నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్ పట్టాపై కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు సోమవారం నిలిపివేసింది. సిఐసి ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్టు నేడు జస్టిస్ సచిన్ దత్తా తీర్పు వెల్లడించారు. ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి ఆర్‌టిఐ కార్యకర్త నీరజ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
1978లో బిఎ పరీక్షలో ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి 2016 డిసెంబర్ 21న సిఐసి ఆర్‌టిఐ కార్యకర్త నీరజ్‌కి అనుమతినిస్తూ సిఐసి 2016 డిసెంబర్ 21 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఢిల్లీ యూనివర్శిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సచిన్ దత్తా ఈ ఏడాది ఫిబ్రవరి 27న తీర్పును రిజర్వ్ చేశారు.