నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖా మంత్రి, పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్ పాటిల్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజా జీవితంలో సుదీర్గకాలం పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా, లోక్‌సభకు కూడా సేవలందించారు. ఆయనకు సమాజ సంక్షేమమంటే మక్కువ. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడాను. కొన్ని నెలల క్రితం నా నివాసంలో ఆయనను కలిశాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి అని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శివరాజ్‌పాటిల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పాటిల్‌తో సన్నిహిత సంబంధం ఉందని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని ఖర్గే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గొప్ప గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుడైన పాటిల్.. కీలకమైన రాజ్యాంగ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించారు. భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలకు గణనీయంగా తోడ్పడ్డారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, ఆయన సమగ్రత, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ఆరాధించిన వారందరికీ తీరని లోటు.
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పాటిల్ మృతికి సంతాపం తెలిపారు. పాటిల్ మరణం చాలా హృదయ విదారకమైనది. పార్టీకి పూడ్చలేని నష్టం. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, దేశానికి ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి అని రాహుల్ పేర్కొన్నారు.
శివరాజ్ పాటిల్ మృతికి మోడీ, ఖర్గే సంతాపం
- Advertisement -
- Advertisement -



