- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జీవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్- అంగోలాల ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించకున్నారని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇరు దేశాధినేతల భేటీ ద్వారా అంగోలా- భారత్‌ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే కాకుండా.. భారత్- ఆఫ్రికా సంబంధాలను కూడా బలోపేతం చేస్తుందని జైశంకర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
- Advertisement -