- Advertisement -
న్యూఢిల్లీ : అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ప్రతిఘటిస్తూ ఇరాన్.. యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో యూఏఈకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. యూఏఈ అధ్యక్షులు, సోదరడు షేక్ మహ్మద్ బిన్ జాయీద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడి దాడులను ఖండించినట్లు మోడీ తెలిపారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో యూఏఈకి భారత్ అండగా ఉంటుందని సంఘీభావం ప్రకటించారు. అలాగే అక్కడి భారత సమాజం పట్ల శ్రద్ధ వహించినందుకు యూఏఈకి మోడీ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



