నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై పీఎం మోడీ లోక్ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే. పీఎం మోడీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ వడోదరలో ఆదివాసీ అధికార్ సమావేశ్‌లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వంద శాతం అమెరికాతో రాజీపడ్డారని, ఆయన మాట్లాడిన మొత్తం ప్రసంగంలో అమెరికా పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారని మండిపడ్డారు. దీంతో మోడీ సర్కార్ తీరు అందరికీ అర్ధమైందన్నారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌తో భారతీయ రైతులను దగా చేశారని ఆందోళనవ్యక్తం చేశారు. భారీ మొత్తంలో యూఎస్ వస్తువులు భారత్ మార్కెట్లోకి తరలివస్తున్నాయి. దీంతో భారత్ రైతుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు.
‘‘నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు బిర్సా ముండా విగ్రహం ముందు చేతులు జోడిస్తారు, కానీ ఆయన ఏ ఆదర్శాల కోసం పోరాడి అమరులయ్యారో, అవే ఆదర్శాలపై దాడి చేస్తారు. బీజేపీ ఆదివాసుల నుండి భూమి, నీరు, అడవులను లాక్కున్నప్పుడు, అది కేవలం బిర్సా ముండాపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపై కూడా దాడి అవుతుంది.” అని రాహుల్ గాంధీ అన్నారు.



