- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడే విధంగా ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ కూడా ఇటీవలే ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కూడా ఇటీవల ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా పాల్గొంది.
- Advertisement -



