- Advertisement -
నవతెలంగాణ – మొయినాబాద్
మొయినాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్ గా మహమ్మద్ జాకీర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించానని ఆయన తెలిపారు. మునుపటి కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ బైంసాకు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ జాకీర్ అహ్మద్ కు స్థానికులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



