నవతెలంగాణ – హైదరాబాద్: పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, రాబోయే 2025-26 దేశవాళీ సీజన్ కోసం బెంగాల్ ప్రకటించిన 50 మంది ఆటగాళ్ల జాబితాలో ఈ ఫాస్ట్ బౌలర్ చోటు దక్కించుకున్నాడు. 34 ఏళ్ల షమీ ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇక, టీమిండియా తరపున 2025 ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగాడు. భారత జట్టు విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చక్రవర్తితో సమంగా నిలిచాడు. ఈ ఇద్దరూ టోర్నీలో తొమ్మిది వికెట్లు పడగొట్టారు.
బెంగాల్ జట్టులోకి మహ్మద్ షమీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES