Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంనెలసరి సెలవులు, మహిళల సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ: సుప్రీంకోర్టు

నెలసరి సెలవులు, మహిళల సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ: సుప్రీంకోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళలకు తప్పనిసరి నెలసరి సెలవును అమలు చేస్తే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి చట్టం వస్తే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఇది మహిళల్లో పురుషుల కంటే తాము తక్కువనే మానసిక భయాన్ని సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నెలసరి సెలవుల నియమాల రూపకల్పనకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర త్రిపాఠి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. రుతుక్రమం అంశంపై అవగాహన కల్పించడం వేరు.. దానిని సెన్సేషన్ చేయడం వేరు. ఈ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన మరుక్షణం ఎవరూ వారిని నియమించుకోరు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదు’’ అంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -