Wednesday, May 14, 2025
Homeసినిమా'మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు' అదుర్స్‌

‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అదుర్స్‌

- Advertisement -


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో నితిన్‌ హీరోగా, శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అంటూ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు. ఈ చిత్రంలోని ఇంపార్టెంట్‌ పాత్రలని, క్యారెక్టర్‌ నేేమ్స్‌ను రివీల్‌ చేస్తూ వదిలిన ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇందులో సప్తమి గౌడ రత్న అనే పాత్రలో, స్వసిక గుత్తి అనే క్యారెక్టర్‌లో కనిపించబోతోన్నారు. ఇక సౌరభ్‌ సచ్‌ దేవ్‌ అగర్వాల్‌ పాత్రను పోషిస్తున్నారు. చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ కనిపించబోతోన్నారు. ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అంటూ ఒక్కొక్కరి పాత్ర ఎలా ఉంటుందో హింట్‌ ఇచ్చారు. కథను కూడా కాస్త రివీల్‌ చేసినట్టు అనిపిస్తోంది. ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ చివర్లో నితిన్‌ ఎంట్రీ, బాణం వదిలిన తీరు అద్భుతంగా ఉంది.
‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ కోసం అజనీష్‌ లోకనాథ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంది. కేవీ గుహన్‌ విజువల్స్‌, కెమెరా వర్క్‌ కూడా ఎలా ఉండబోతోందో ఈ ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ చూపించేస్తోంది. మొత్తానికి శ్రీరామ్‌ వేణు మాత్రం ఈసారి తెరపై మ్యాజిక్‌ చేయబోతోన్నాడని ఈ ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ చెప్పకనే చెబుతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి నిర్మాత – దిల్‌ రాజు, శిరీష్‌, రచన -దర్శకత్వం – శ్రీరామ్‌ వేణు,
సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్‌, ఎడిటింగ్‌ – ప్రవీణ్‌ పూడి, మ్యూజిక్‌ – అజనీష్‌ లోకనాథ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -