Saturday, September 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్దుప్పి మాంసం పట్టి వేత...

దుప్పి మాంసం పట్టి వేత…

- Advertisement -

– ఆరు బైకులు స్వాధీనం..
నవతెలంగాణ-ముధోల్

ముధోల్ మండలంలోని విట్టోలి తాండ గ్రామ సమీపంలో వేటగాళ్ళు దుప్పిని వేటాడి, మాంసము కోసి పాళ్లు వేస్తుండగా విశ్వసనీయసమాచారం మేరకు అటవీశాఖ అధికారులు దాడి చేశారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ కథ‌నం ప్రకారం.. విట్టోలి తాండ గ్రామ సమీపనపొలంలో సోమవారం సాయంత్రం దుప్పి మాంసాన్ని కోసి వేటగాళ్లు పాలేస్తుండగా సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలంకు చేరుకునే లోపు వేటగాళ్లుపారిపోయారని తెలిపారు. దింతో దుప్పి మాంసం తోపాటు, సంఘటన స్థలంలో ఉన్న ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.త్వరలో నిందితులను పట్టుకుంటామని సెక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా రేంజ్ పరిధిలోని అటవీశాఖ సిబ్బంది, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -