- – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఉదయం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆపరేషన్ సిందూర్ విజయం, పర్యవసానాలను ఆయన వివరించారు. సిందూర్ అనేది కొనసాగుతున్న ఆపరేషన్ అని అన్నారు. భారత్ మరిన్ని దాడులు చేయాల్సిన అవసరం లేదని, కానీ పాక్ దళాలు దాడిచేస్తే తిరిగి ఎదురు దాడి చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, ఎస్.జయశంకర్, జె.పి.నడ్డా, నిర్మలా సీతారామన్ ప్రభుత్వం తరపున హాజరవగా, కాంగ్రెస్ నుండి లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, టిఎంసి నుండి సందీప్ బందోపాధ్యాయ, డిఎంకె నుండి టి.ఆర్.బాలులు సమావేశానికి హాజరయ్యారు.