Saturday, September 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం50 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి

50 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. తాజాగా జరిపిన దాడుల్లో మరో 50 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజావ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున నుంచి జరిపిన దాడుల్లో 51 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో 43 మంది గాజా సిటీకి చెందిన వారే మరణించడం గమనార్హం. ఆగస్టులో ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించినప్పటి నుంచి గాజానగర జనాభాలో దాదాపు సగం మంది పాలస్తీనియన్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారని పాలస్తీనియన్‌ సివిల్‌ డిఫెన్స్‌ తెలిపింది.
కాగా, అక్టోబర్‌ 2023 నుంచి ప్రారంభమైన ఇజ్రాయిల్‌ దాడుల వల్ల ఇప్పటివరకు 65,208 మంది మృతి చెందారు. 166,271 మంది గాయాలపాలయ్యారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -