Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకాంగ్రెస్‌కు 50కు పైగా సీట్లు!

కాంగ్రెస్‌కు 50కు పైగా సీట్లు!

- Advertisement -

మహాగట్‌బంధన్‌లో కొలిక్కి వచ్చిన చర్చలు !
పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య సీట్ల విషయంలో చర్చలు ముగింపు దశకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు 50కు పైగా సీట్లు ఇవ్వడానికి ఆర్జేడీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 2020 ఎన్నికలు మాదరిగానే ఈసారి కూడా 70 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరినా ఆర్జేడీ మాత్రం అందుకు అంగీకరించలేదని, 50 పైగా సీట్లు ఇవ్వడానికి ఒప్పుకుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. బీహార్‌లో మహాగట్‌బంధన్‌ పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ 2020 ఎన్నికల్లో పోటీ చేశాయి. రాష్ట్రంలో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్‌ 70, సీపీఐ(ఎం) నాలుగు, సీపీఐ ఆరు, సీపీఐ (ఎంఎల్‌) 19 స్థానాల్లోనూ పోటీ చేశాయి. ఈ ఏడాది కాంగ్రెస్‌తో చర్చలు గురించి ఆర్జేడీ సీనియర్‌ నాయకులు ఒకరు మాట్లాడుతూ సానుకూల వాతావరణంలో ఈ చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. త్వరలో చర్చలు ముగుస్తాయని చెప్పారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad