ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- దుబ్బాక
నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనుల్ని త్వరగా పూర్తిచేస్తే మరింత దిగుబడి సాధ్యమవుతుందని, యాసంగి పంటలకు తుకాలు వేసే లోగా వాటిని పూర్తిచేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో, మున్సిపల్ పరిధిలోని లచ్చపేట, మల్లాయిపల్లి వార్డుల్లో, మండల పరిధిలోని ఆకారం, రగోతంపల్లి, రామక్కపేట, అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డిపేట గ్రామాల్లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం), మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్, చేర్వాపూర్ వార్డుల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. దుబ్బాక, శంకరంపేట, రామయంపేట కెనాల్ లను పూర్తి చేస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రైతులు 5 నుంచి 6 వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తారన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిడ్డంగి ని కట్టిన దాఖలాలు లేవని, కరెంటు సమస్యలు ఎక్కువైనాయని విమర్శించారు. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరం 40 శాతం అధికంగా పంట దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, వైస్ చైర్మన్ కాల్వ నరేష్, డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఏఎంసీ సెక్రెటరీ సురేష్, గణేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెండింగ్ కాల్వల్ని పూర్తి చేస్తే మరింత దిగుబడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



