- Advertisement -
నవతెలంగాణ-తాడూర్
పిండి గిర్నీలో విద్యుద్ఘాతంతో తల్లీకొడుకులు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాండూరు మండల పరిధిలోని తుమ్మల సుగురు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జయమ్మ(40) పిండి గిర్నీ నడుపుతోంది. గురువారం గిర్నీ వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి విద్యుద్ఘాతంతో జయమ్మ, ఆమె కొడుకు శ్రీకాంత్(15) కింద పడిపోయారు. చుట్టుపక్కల వారు గమనించి 108లో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
- Advertisement -