- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.
- Advertisement -