- Advertisement -
ఇంకిన కన్నీరును
చెరిగిన చిరునవ్వును
విరిగిన మనస్సును
నలిగిన హృదయాన్ని
కనురెప్ప మాటున పెను ఉప్పెనగా దాచేది అమ్మ
కాలం వేసే గాలానికి
విధి ఆడే వింత నాటకానికి
మనుషులు ఆడే చదరంగానికి
సమాధానాలు లేని ప్రశ్నలకు
నిలువెత్తు సాక్ష్యం అమ్మ
– ఈసరి భాగ్యం

- Advertisement -