నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. నిన్న కూతురి వివాహం ఘనంగా జరిపించిన తల్లి.. కుమార్తెను అత్తారింటికి పంపే క్రమంలో హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. పూర్తి వివరాలోకి వెళితే… కామేపురం మండలం అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి దంపతుల పెద్ద కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడితో ఆదివారం ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం సాయంత్రం కుమార్తె అప్పగింతల కార్యక్రమంలో తల్లి కల్యాణి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలో ఆ తల్లి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటనతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. తల్లి మృతితో నవవధువు ఏడ్చిన తీరు పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులను కలిచివేసింది.
కుమార్తె అప్పగింతల వేళ ఆగిన తల్లి గుండె..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES