నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్దగుల్లా గ్రామంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమములో భాగంగా ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా పిల్లలకు కేంద్రం టీచర్ లతా తాయి అక్షరాభ్యాసం చేయించారు . ఈ సందర్భంగా రెండున్నర ఏండ పిల్లలకు పలుకలు అందజేస్తూ అక్షరాభ్యాసం చేయించారు . అదేవిధంగా రెండున్నర ఏండ్లు పూర్తి చేసుకున్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చేశారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటో పాటలతో కూడిన విద్యను నేర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఆర్గనైజేషన్ సభ్యురాలు ఆషా , అంగన్వాడీ టీచర్స్ , సెక్టార్ సూపర్వైజర్ దేవాకరుణ , బాలింతలు, పిల్లల తల్లులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ ఆధ్వర్యంలో అమ్మ మాట – అంగన్వాడి బాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES