Wednesday, November 5, 2025
E-PAPER
Homeనిజామాబాద్వాహనాదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలి

వాహనాదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలి

- Advertisement -
  • ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి
    నవతెలంగాణ-కంఠేశ్వర్
    ప్రతి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని, అదేవిధంగా అంబులెన్సులు అత్యవసర సమయాలలో వారి సేవలు ఉన్నందున వారు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు అంబులెన్స్ యొక్క కండిషను చూసుకోవాలని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సూచించారు. బుధవారంనిజామాబాద్ అంబులెన్స్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి హాజరై సమావేశంలో వారు మాట్లాడుతూ.. అదేవిధంగా అంటే అంబులెన్స్ టైర్ లలో తగిన మోతాదులో గాలి ఉండేటట్లు, బ్రేకులు, క్లచ్, సరిపోయే విధంగా హెడ్లైట్, ఆక్సిజన్ మరియు ఫైర్ ఎక్సటింగ్ విషర్ ఉండాలని సూచించారు. అంతేకాకుండా అంబులెన్స్ వాహనాలు వారికి కేటాయించినటువంటి పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్కు చేయవలెనని, ఎట్టి పరిస్థితిలో రోడ్డుమీద కానీ ప్రక్కన కానీ అంబులెన్స్ వాళ్ళు వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేసి అసౌకర్యానికి గురి చేయవద్దని సూచించారు.

ట్రాఫిక్కు జాము కాకుండా చూడాలని తెలిపినారు అంతేకాకుండా అంబులెన్స్ డ్రైవర్లు పేషెంట్ ను హాస్పిటకు వెళ్లే సమయంలో మాత్రమే అంబులెన్స్ యొక్క సైరన్ను వినియోగించుకోవాలని మిగతా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సైరన్ వాడకూడదని తెలిపినాడు. ఇది సమావేశంలో వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి మాట్లాడుతూ అంబులెన్స్లలో ఎట్టి పరిస్థితిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ డ్రైవర్లు, ట్రాఫిక్, ఒకటవ టౌన్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -