- అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బి.రవికుమార్..
నవతెలంగాణ-సుల్తాన్ బజార్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలునిబంధనాలు పాటిస్తూ ముందుకు సాగాలని అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బి రవికుమార్ అన్నారు. బుధవారం నాంపల్లి రోడ్డు లోని పాత కలెక్టరేట్ ఆవరణలో గల అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ… వాహనదారుల ఒక క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారుతోందని అందుకే వాహాన దారులు బండి నిదానంగా నియమ నిబంధనలు పాటిస్తు ప్రయాణాలు సాగించాలని సూచించారు. అధిక వేగం, వాహనాల ఒవర్టేక్, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మట్, ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ లు వాడకం వల్ల ప్రాణ రక్షణకు కవచం లాంటిదని అన్నారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యం చేయరాదు అన్నారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా, కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వాహానాలు నడపాలని కోరారు.
రహాదారి భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో మార్పుతీసుకురావడమే లక్ష్యమని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహానదారులకు చాలాన్ విధిస్తామన్నారు. బాటసారులు నడిచే రోడ్డు ను ఫుట్ పాత్ ను వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారులు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



