నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ 2025 సంవత్సరానికి సినారె స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైనట్టు సత్య సంగీత ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓంకార్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఓంకార్ రాజు మాట్లాడుతూ.. మల్లిక్ కవిగా దిగంబర, గరళం, తప్తస్పృహ, మంటల స్నానం, చలనకాంక్ష వంటి ఉత్తమశ్రేణి కవితా సంపుటులు వెలువరించారనీ, అవి పలు పురస్కారాలు పొంది, సాహిత్య రంగంలో మంచి గుర్తింపును పొందారన్నారు. మౌనశ్రీ కవిగానే కాకుండా టీవీ ధారవాహికలకు సుమారు 700 పైగా పాటలు రాసి రికార్డులు సృష్టించారని అన్నారు. అంతేకాకుండా పలు సినిమాలకు కూడా పాటలు రాస్తున్నారని ప్రశంసించారు. మల్లిక్ అన్ని రకాల పాటలు కలుపుకొని 1000 పాటల మైలురాయిని దాటడం గొప్ప విషయం అన్నారు. ఆగస్టు 21న హైదరాబాదులోని త్యాగరాయగాన సభలో జరిగే ఈ కార్యక్రమానికి సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖులు, గాయనీగాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.