Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మౌనశ్రీకి సినారె సాహిత్య పురస్కారం

మౌనశ్రీకి సినారె సాహిత్య పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: ప్రముఖ కవి, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ 2025 సంవత్సరానికి సినారె సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. మహాకవి సినారె కళా పీఠం వ్యవస్థాపకులు ఎం. రాములు, సంస్థ సలహాదారు డాక్టర్ పోరెడ్డి రంగయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆగస్టు 3న హైదరాబాదులో జరగబోయే సాహిత్య సభలో ఈ పురస్కారాన్ని మౌనశ్రీకి అందజేస్తారు. మల్లిక్ గతంలో సాహితీ గౌతమి అందించే ప్రతిష్టాత్మక సినారె కవితా పురస్కారం, సినారె – వంశీ ఫిలిం అవార్డు, తేజస్విని కల్చరల్ ఆర్గనైజేషన్ అందించే సినారె సాహిత్య పురస్కారం వంటి సినారె పేరుతో ఉన్న పురస్కారాలన్నింటినీ అందుకోవడం విశేషం. మల్లిక్ కవితను, పాటను తన రెండు కళ్ళు గా భావించి ఉత్తమశ్రేణి రచయితగా కొనసాగుతున్నారని డాక్టర్ పోరెడ్డి రంగయ్య ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -