- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. అద్దె ప్రాతిపాదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. పర్సంటేజ్ ప్రాతిపాదికన చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని డిమాండ్ చేశారు.
- Advertisement -