– చిన్నారుల చిరునవ్వుకు చిరునామాగా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చి దిద్దాలి :సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘అమ్మమాట..అంగన్‌వాడీ బాట’ నినాదంతో ముందుకు సాగాలనీ, అంగన్‌వాడీ కేంద్రాలను చిన్నారుల చిరునవ్వుకు చిరునామాగా తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై జిల్లాలవారీగా సమీక్ష నిర్వహించారు. అందులో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెస్లీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బడీడు పిల్లలు బడిలో, చిన్న వయస్సు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లేస్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలనీ, వాటిలోని సౌకర్యాల గురించి చెబుతూ వారికి నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీడబ్ల్యూఓలదే అని నొక్కి చెప్పారు.
అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. వసతులు లేని చోట్ల కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చాలనీ, దీనిపై డీఈవో ఎంఈఓలతో బీడబ్ల్యూఓలు మాట్లాడి షిఫ్టింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో అంగన్వాడి కేంద్రానికి రూ.12 లక్షల చొప్పున 85 కేంద్రాలకు మంజూరు చేశామని తెలిపారు. పీఎం జన్మన్ స్కీం ద్వారా పివిటిజీ ఆవాసాల్లో 8 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరయ్యాయనీ, వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా 457 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసామని తెలిపారు. 289 కేంద్రాల్లో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయనీ, మరో 211 కేంద్రాల్లో పూర్తిచేయాల్సి ఉందని చెప్పారు.
‘అమ్మమాట..అంగన్‌వాడీ బాట’ నినాదంతో ముందుకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES