- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల తరలింపు కొనగుతోంది. దీంతో యూసఫ్‌గూడ బస్తీ నుంచి ఇంద్రానగర్ లేబర్ అడ్డా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు అరగంటకుపైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులతోపాటు ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో చిక్కుకుపోయారు. “సమయానికి ఆఫీసుకు వెళ్లలేకపోతున్నాం.. ఆలస్యమవుతోంది” అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా “ప్రయాణానికి ఎక్కువ టైమ్ పడుతోంది” అని తెలిపారు.
- Advertisement -