నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దా, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ వారం ప్రారంభంలో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించడంతో ఈ వివాదం మొదలైంది. తన గొంతును అణచివేస్తున్నారని ఆరోపిస్తూ ఆప్ ఎంపీ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో లిక్కర్ స్కాంపై, దేశంలో నెలకొన్న చమురు సంక్షోభంపై, సర్ ప్రక్రియ, పార్టీ నిర్ణయాలకు ప్రతికూలంగా వ్యవహారించారంటూ ఆప్ ఆధిష్టానం రాఘవా చద్దాపై గుర్రుగా ఉన్నా విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆప్ నేతలు కూడా ఆయనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాఘవ చద్దా కూడా ప్రతి విమర్శలకు దిగారు. పంజాబ్ సమస్యలపై రాఘవ పార్లమెంట్‌లో లెవనేత్తలేదని ఆప్ నేతలు ఆరోపించారు. వారి వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్ వేదికగా మరోమారు ఎంపీ రాఘవ చద్దా కౌంటర్ ఇచ్చారు.
పంజాబ్‌కు సంబంధించి అనేక అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించానని, నానక్ సాహెబ్ కారిడార్, రైతులుకు మద్ధతుగా కనీస మద్ధతు ధరకు చట్టబద్ధ హామీ, పంజాబ్‌లో తరిగిపోతున్న భూగర్భ జలాల సమస్యను పరిష్కరించడం, భగత్ సింగ్‌కు భారత్ రత్న గుర్తింపును సిఫార్సు, ఇంకా అనేక ఇతర కీలక సమస్యలపై మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. “‘పార్లమెంటులో పంజాబ్ సమస్యలను లేవనెత్తడంలో రాఘవ్ చద్దా విఫలమయ్యారు’ అని చెబుతూ వీడియోలు విడుదల చేయవలసి వచ్చిన ఆప్‌లోని నా సహచరుల కోసం….. పిక్చర్ అభీ బాకీ హై. పంజాబ్ నాకు చర్చనీయాంశం కాదు. అది నా ఇల్లు, నా కర్తవ్యం, నా నేల, నా ఆత్మ’ అని ఆయన పేర్కొన్నారు.



