నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వంపై శివసేన(UBT)ఎంపీ సంజయ్ రౌత్ పైర్ అయ్యారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతుందని, కానీ ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించబోతుందని మోడీ సర్కార్ నయా ప్రగల్బాలకు శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. రోజురోజూకు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయని మహారాష్ట్రలోని ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఉన్న 85 కోట్ల పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం సరైన ఆహార పదార్థాలు అందించక లేకపోతుందని ఆరోపించారు.ఏ విధంగా ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించబోతుందని ప్రచారం చేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం జరిగిన నీతి అయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ వికసిత్ భారత్‌నే లక్ష్యమని, ప్రపంచంలో జపాన్‌ని అధిగమించి భారత్ అతిపెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ సంజయ్ రౌత్ పైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES