నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కంఠాలి జీపి గ్రామంలో గురువారం నాడు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పరిశుభ్రత గురించి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. గ్రామం నిత్యం శుభ్రంగా ఉంచాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు నిత్యం గ్రామ శుభ్రత పాటించాలని తెలిపారు. ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని , ప్రజల ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమకు బాగు ఉంటుందని అన్నారు . అనంతరం గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటిని నిర్మాణాలు చేస్తున్న వాటిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనులను వేగం పెంచాలని సూచించారు. పనులు పూర్తీ అయితే వెనువెంటనే బిల్లులు తమ ఖాతాలో అధికారులు పరిశీలించి జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం పరిశీలించి పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి పనులు కులాయి పనులు వెంట వెంటనే వసూలు చేసి 100% చేరుకోవాలని పెండింగ్ ఢిల్లీలో ఉంచకుండా నిత్యం గ్రామ ప్రజలకు ఉంటూ వారికి అవగాహన చేస్తూ పన్నులు వసూలు చేయాలని కార్యదర్శికి ఆదేశించారు. గ్రామంలో నిర్మించిన సిసి రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు కంఠాలి గ్రామ పంచాయతీ కార్యదర్శి , ఇందిరమ్మ పథక గృహ నిర్మాణ లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కంఠాలి అభివృద్ధి పనులను పరిశీలించినా ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES