- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న నర్సరీని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జిసి మున్నయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో జరుగుతున్న పనులను,మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం విషయంలో అశ్రద్ధ చూపరాదని,రానున్న వేసవి కాలం దృష్ట్యా మొక్కల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా,ఉప సర్పంచ్ పొగాకు పెద్ద సైదులు,పంచాయితీ కార్యదర్శి నజీర,వార్డ్ మెంబర్ లపంగి మహేందర్,ఫీల్డ్ అసిస్టెంట్ సల్వోజ్ యాదయ్య, వడ్డె లోకేష్ పాల్గొన్నారు.
- Advertisement -



