నవతెలంగాణ -పెద్దవంగర
ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అధికారులు ఆ మేరకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్ తుది గెజిట్ నోటిఫికేషన్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు దాని పతులను కార్యాలయంలో ప్రచురించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు గత ఏడాది నిర్వహించిన కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు.
మండలంలో మొత్తం 26 సర్పంచ్ స్థానాలకు గాను బీసీలకు 3, ఎస్సీలకు 3, ఎస్టీలకు 14, జనరల్ 6 స్థానాలు, కాగా 192 వార్డు స్థానాల్లో బీసీలకు 27, ఎస్సీలకు 27, ఎస్టీలకు 81, జనరల్ కు 57 స్థానాలకు కేటాయించారు. మండలంలో రెండో విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, కార్యలయ సిబ్బంది సోమయ్య, సురేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



