నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్, బస్వాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిపి కార్మికులతో పాటు గ్రామానికి చెందిన యువకులు కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతనే ధ్యేయంగా శ్రమదానం చేశారని గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్, రమణ సురేష్ గొండా మాట్లాడుతూ.. గ్రామంలోని నాటిన ప్రతి చెట్లకు నీరంధచడం, గ్రామ పరిశుభ్రత, చెత్తాచెదారం లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం అంశాలను తీసుకొని గ్రామస్తులతో కలిసి పరిశుభ్రం చేయడం జరిగింది అని తెలిపారు.
జుక్కల్ మండల కేంద్రంలోని ఆక్సిజన్ పార్కులో పిచ్చి మొక్కలు గడ్డి ముళ్ళ పొదలను ఎంపీడీవో ఆధ్వర్యంలో తొలగించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా జుక్కల్ ఎంపిడిఓ పాల్గొన్నారు. బస్వాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన చెట్ల వద్ద పేరుకుపోయిన గడ్డి , పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ బస్వాపూర్ గ్రామ సర్పంచ్, మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, భరద్వాజ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



