నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ పథకంలో నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో శ్రీనివాస్ గృహప్రవేశ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీడీవో మాట్లాడుతూ మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ పథకంలో గృహనిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం జరగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు గృహాలను నిర్మించుకోవాలని, పేదరికం పార ద్రోలాలని సర్పంచ్ సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ ఎంపీడీవో మొదటగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గృహప్రవేశ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ సాయ గౌడ్, ఎంపీ ఓ రాము, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ , గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ గృహ పథకంలొ నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


