నవతెలంగాణ-హైదరాబాద్: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిలక నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో తొలుత ప్రారంభించి ముగించింది. ఆ తర్వాత తర్వలో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళలతో పాటు సర్ ప్రక్రియను ముమ్మరం చేసి సవరించిన ఓటర్ల జాబితాలను కూడా విడుదల చేసింది. ఈ సర్వే పేరుతో అర్హుల పేర్లను తొలగించారని, సరైన కారణాలు లేకుండా భారీ మొత్తంలో ఓట్ల తొలగింపులకు ఈసీ పాల్పడుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సర్ ప్రక్రియను నిలిపివేయాలని పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖాలు చేశాయి. సర్ ప్రక్రియను వ్యతికిస్తూ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను చేపట్టగా, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సర్ సర్వేను తీవ్రంగా వ్యతిరేకించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనాలు విన్పించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
తొలి విడత సమావేశాల్లోనే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. తాజాగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు నోటీస్‌పై సంతకం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థన నోటీసును శుక్రవారం విపక్షాలు ఏదో ఒక సభలో అందజేస్తాయని తెలిసింది. ఆ నోటీస్‌పై సంతకం చేయడానికి ఎంపీలు ఎంతో ఉత్సాహాన్ని చూపించారని ఒక విపక్ష ఎంపీ తెలిపారు.



