నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని సావర్గావ్ గ్రామంలో పరిధిలో ఉన్న కౌలసనాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు మంజీరాలోకి వదిలేస్తున్నారు. ఈ సందర్భంగా పరివాహక ప్రాంత గ్రామాలలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది సావర్గం మాజీ సర్పంచ్ కిషన్ పవర్ తో కలిసి సందర్శించారు. గ్రామస్తులు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అన్నారు. ప్రాజెక్టు నీటి విడుదల జరుగుతోందని తెలిపారు. పశువుల కాపరులు రైతులు ఎవరు కూడా పంట పొలాల్లోకి రాకూడదని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సర్దుకుపోయిన తర్వాతనే బయటకు రావాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మారుతి, గిర్దావర్ రామ్ పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్, మాజీ జుక్కల్ సర్పంచ్ బొంపెల్లి రాములు , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కౌలసనాల ప్రాజెక్టు విడుదల చేసిన వరద నీటిని పరిశీలించిన ఎమ్మార్వో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES