నవతెలంగాణ -ముధోల్
ముధోల్ ప్రాంత అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ముధోల్ మండలంలోని బ్రాహ్మంన్ గావ్ గ్రామంలో పంచాయతి కార్యాలయ భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. అలాగే సుమారు 20కోట్లతో వివిధ అభివృద్ధి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. పంచాయతీ కార్యాలయంలో స్టీల్ బ్యాంకు ను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత పాలకుల హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు అన్యాయం జరిగిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బ్రహ్మంన్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ కు త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. సిసి రోడ్లు నాణ్యత గా చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. అర్హులకు ఇందిరమ్మ పధకం కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పలువురికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఆడిషనల్ కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఎస్పీ జానకి షర్మిల,మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, తెలంగాణ జన సమితి ముధోల్ ఇంచార్జి సర్థార్ వినోద్ కుమార్,మాజీ సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, అప్రోజ్ ఖాన్,కోరి పోతన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ముధోల్ ప్రాంత అభివృద్ధికి పెద్ద పీట: మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES