నవతెలంగాణ – రాయపోల్ : తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా సోషల్ రిఫార్మషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి తెలిపారు. మంగళవారం తార్నాక హైదరాబాద్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు జిల్లాల కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి మలిదశ ఉద్యమాలలో ఎంతో మంది ఉద్యమకారులు పాల్గొని ఎన్నో త్యగాలు చేసి రాష్ట్రం సిద్ధించే వరకు పోరాటం చేశారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైన ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదన్నారు. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి అయిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు అనేక హామీలను ఇచ్చిందని, ఆ హామీలు అమలు చేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తుందన్నారు. దానిలో భాగంగానే సిద్దిపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ సుల్తాన ఉమర్ ను నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం మహమ్మద్ సుల్తాన ఉమర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను ఏకం చేయడానికి తనవంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఎన్నో హామీలను ఇచ్చిందని ఆ హామీలు అమలు చేసేంతవరకు టియు జెఎసి పక్షాన పోరాడుతామన్నారు. అలాగే టి యు జెఎసి సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా తనని నియమించినందుకు టి యు జెఎసి రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి ప్రధాన కార్యదర్శి ప్రపుల్ రామ్ రెడ్డి, కోశాధికారి కళ్లెం ప్రసాద్, వేముల యాదగిరి, డోలక్ యాదగిరి, బాకారం లావణ్య, కందుల ధనలక్ష్మి ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
టియు జేఏసీ జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ సుల్తాన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES