నవతెలంగాణ-హైదారాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇటీవల రెండు దేశాల మధ్య పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు పలువురు యుద్ధనిపుణులు. పాక్, ఇండియా ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ దేశంతో భారత్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశానికి చెందిన అధునాతన రాఫెల్ విమానాలను కొనుగోలు చేసింది. అంతేకాకుండా యూపీలోని గంగా ఎక్స్ ప్రెస్ పై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాప్ సాధనాలు చేపట్టాయి. అత్యవసర సమయల్లో రన్ వేకు ప్రత్యామ్నాయంగా..ఈ తరహా ఎక్స్ ప్రెస్‌లు ఏమేరకు ఉపయోగపడుతాయో ఎయిర్ ఫోర్స్ అధికారులు పరిశీలించారు. నౌకదళం పరంగా ఇండియా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి. ఇటీవలె అరేబియా సముద్రంలో క్షిపణులను పేలుళ్లను విజయవంతంగా చేపట్టాయి.
మరోవైపు పాక్ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యుద్దానికి తాము సిద్ధమంటూ మేకపోతు గంభీర్యాన్నీ ప్రదర్శిస్తుంది. భారత్ ప్రభుత్వం విధించిన దౌత్య ఆంక్షలను షరిప్ ప్రభుత్వం జీర్ణంచుకోలేకపోతుంది. దాయాది నేతలు మాటలతో ప్రేటేగి పోతున్నారు. తాము కూడా పహల్గాం దాడిని ఖండిస్తున్నామని, పారదర్శక దర్యాప్తుకు సిద్ధమని చెప్పుతునే మాటల ద్వారా యుద్ధ కాంక్షను తెలియజేస్తుంది. తాజాగా పాక్-ఇండియా సరిహద్ద ప్రాంతాల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వెళ్లే క్షిపణులను పాకిస్థాన్ ఆర్మీ ప్రయోగించింది. ఈమేరకు ఈదేశ మీడియా సంస్థలు శనివారం పలు కథనాలను వెల్లడించాయి. ఇటీవలె గగనతలంలో గందరగోళ పరిసితులను తగ్గించేందుకు ఆదేశ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర ఆపరేషన్ల కోసమే పలు ప్రయోగాలు చేస్తుంది. అంతేకాకుండా ఈ క్షణంలోనైనా భారత్ దాడి చేస్తుందని..రాడార్ వ్యవస్థను అప్రమత్తం చేస్తోంది. ఆదేశ సరిహద్దు ప్రాంతాలకు తరలించి..నిఘా పెంచింది.
పాక్‌లో పలు క్షిపణుల ప్రయోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES