నవతెలంగాణ – అలంపూర్
అలంపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పిండి జయరాములు ను మంగళవారం బీబీసీఎస్( భారతీయ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘ్ ) ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీబీసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగోల్ల ఈశ్వర్ మాట్లాడుతూ అలంపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని మున్సిపల్ చైర్మన్ జయరాములు కు సూచించారు. బీసీ ల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలలో బీసీలకు జనాభ కు అనుగుణంగా స్థానాలను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, శివాని, సంజీవ, రామంజి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



