- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో శనివారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి పర్యటించి ఆ కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినాయక్ నగర్ కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు సమస్యలను మున్సిపల్ కమిషనర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ అధ్యక్షులు చింతల లింగం, కోశాధికారి సునీల్ కుమార్, అడ్వకేట్ తిరుపతి, లక్ష్మణ్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, లింగం రిటైర్డ్ టీచర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -