– ఓటర్ల ప్రలోభాలపై అధికారుల కట్టుదిట్టమైన నిఘా
నవతెలంగాణ – కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించగా, చివరి రోజు అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు జరుగకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగదు, మద్యం లేదా ఇతర ప్రలోభాల పంపిణీకి అడ్డుకట్ట వేయడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్లు, పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే 9908712421 ఈ నెంబర్కు ఫోన్ చేసి
ఎన్నికల నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారగా, పోలింగ్ రోజుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.



