నవతెలంగాణ – బిచ్కుంద
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేసి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితా ఈనెల 10లోగా ప్రచురించాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఫోటో ఆధారిత ఓటర్ జాబితా పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ కమిషనర్ హయ్యూం మాట్లాడుతూ జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి ఐదవ తేదీన రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి ఓటర్ల పేర్లు చిరునామాలు వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులతో సరిచేసిన తుది జాబితా జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారిగా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



